పెంకుటిల్లు కూలి వ్యక్తి మృతి

పెంకుటిల్లు కూలి వ్యక్తి మృతి

ASR: జీకేవీధి మండలం దుప్పులవాడ గ్రామంలో పెంకుటిల్లు కూలి ఓ వ్యక్తి మృతి చెందినట్లు సీలేరు ఎస్సై ఎండీ యాసిన్ గురువారం తెలిపారు. గ్రామ శివారులలో ఉన్న పెంకుటిల్లులో నివసిస్తున్న వంతాల చిన్నయ్య అనే వ్యక్తి నిన్న రాత్రి ఇంట్లో పడుకుని వున్న సమయంలో, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి ఇల్లు కూలిపోయింది. దీంతో చిన్నయ్య మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు.