పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించిన ఏవో
KRNL: ఎమ్మిగనూరు మండలం గుడికల్, కలుగొట్ల గ్రామాలలోని రైతు సేవా కేంద్రాలలో ఏడీఏ ఖాద్రి ఆధ్వర్యంలో ఏఓ ఎం.శివ శంకర్ రైతులతో కలిసి 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం బుధవారం నిర్వహించారు. గుడికల్లో గోరంట్ల అనే రైతు ఆలుగడ్డ వేసిన పొలాన్ని సందర్శించారు. ఆ రైతు అనుభవాలను తీసుకున్నారు. రైతులకు ఏడీఏ ఖాద్రి పలు సలహాలు, సూచనలు అందజేశారు.