పాముకాటుతో పదవ తరగతి విద్యార్థి మృతి

సూర్యపేట: తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని మోత్కూరు మండలం దత్తప్రుగుడెం గ్రామానికి చెందిన మమత-కుమార్‌ల పెద్ద కుమారుడైన ముక్కెర్ల ఉమేష్ 16 సం. ఇంట్లో నిద్రిస్తుండగా బుధవారం రోజు తెల్లవారు జామున 4.30 గం లకు కట్లపాము కాటు వేయడంతో భువనగిరి ఆస్పుత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. మృతుడు 10వ తరగతి పరీక్షలు వ్రాస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. బాలుడి మృతితో గ్రామంలో విశాధ ఛాయలు అలుముకున్నాయి.