అభిషేక్ దూకుడును అడ్డుకుంటాం: సామ్ కరన్

అభిషేక్ దూకుడును అడ్డుకుంటాం: సామ్ కరన్

రేపు భారత్, ఇంగ్లండ్ మధ్య జరగనున్న సెమీఫైనల్ పోరుకు ముందు ఇంగ్లీష్ ఆల్ రౌండర్ సామ్ కరన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. గతంలో వాంఖడేలో అభిషేక్ శర్మ తమపై బాదిన సెంచరీ గురించి ప్రస్తావిస్తూ.. 'అభిషేక్ అలాంటి ప్రదర్శనను మళ్లీ పునరావృతం చేయడని ఆశిస్తున్నాం' అని పేర్కొన్నాడు. ఈసారి అతన్ని త్వరగా అవుట్ చేయడానికి తాము పక్కా ప్రణాళికలతో సిద్ధమయ్యామని కరన్ ధీమా వ్యక్తం చేశాడు.