సమస్యలపై దృష్టి: ఎంపీ, ఎమ్మెల్యే

కడప: రాజంపేట ప్రాంత సమస్యలపై దృష్టి పెట్టినట్లు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిలు గురువారం స్థానిక రోడ్లు భవనాల అతిథి గృహంలో అన్నారు. వారు రాజంపేట మున్సిపల్ వార్డు కౌన్సిలర్లతో వైసీపీ అభిమానులతో సమావేశమయ్యారు. అభివృద్ధి పనులపై దృష్టి పెడతామని తెలియజేశారు.