చనిపోయిన భార్య కోసం నటుడు ఏం చేశారంటే?

బాలీవుడ్ నటి షెఫాలీ జరివాలా జూన్‌లో చనిపోయారు. ఈ విషయాన్ని ఆమె భర్త పరాగ్ త్యాగి జీర్ణించుకోలేకపోతున్నారు. వారి 15వ వెడ్డింగ్ యానివర్సీ సందర్భంగా పరి కోసం ఇదే తన గిఫ్ట్ అంటూ వీడియో షేర్ చేశారు. తన ఛాతీపై షెఫాలీ ముఖాన్ని టాటూ వేయించుకున్నారు. దీనికి 'నా మనసులో తను ఎల్లప్పుడూ ఉంటుంది. నా శరీరంలోని అణువణువు తనే ఉంటుంది. ఇప్పుడది అందరికీ కనిపిస్తోంది' అని క్యాప్షన్ ఇచ్చారు.