లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ లేరు: గొగొయ్
లోక్‌సభలో ఇప్పటివరకు డిప్యూటీ స్పీకర్ లేరని ఎంపీ గౌరవ్ గొగొయ్ అన్నారు. డిప్యూటీ స్పీకర్ లేకుండానే సభ నడుస్తోందన్నారు. ప్రతిపక్ష సభ్యులు మాట్లాడుతున్నప్పుడు స్పీకర్ ఓం బిర్లా తరచూ అంతరాయం కలిగించేవారని ఆరోపించారు. స్పీకర్ పార్టీలకు అతీతంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. దీంతో లోక్‌సభలో స్పీకర్‌పై అవిశ్వాస తీర్మాణం పెట్టినట్లు వెల్లడించారు.