పీఆర్టీయూ క్యాలెండర్ ఆవిష్కరణ
BHNG: ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘమైన పీఆర్టీయూ క్యాలెండర్‌ని బీబీనగర్ మండల విద్యాధికారి సురేష్ రెడ్డి ఆవిష్కరించారు. సంఘ బాధ్యులు క్యాలెండర్‌తో పాటు డైరీని అందజేశారు. ఉపాధ్యాయ సమస్యలను తీర్చే సంఘం పీఆర్టీయూ అని సంఘ బాధ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మాధవి, బాధ్యులు కవిత, శ్రీనివాస్, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.