VIDEO: ప్రమాదకరంగా మారిన విద్యుత్ తీగలు
ASF: కాగజ్ నగర్ సుభాష్ కాలనీలో విద్యుత్ తీగలు ప్రమాదకరంగా మారాయి. ఇళ్లపై నుంచి వెళ్తున్న వైర్లు కిందికి వాలిపోవడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఎలాంటి రక్షణ చర్యలు లేకపోవడంపై కాలనీవాసులు మండిపడుతున్నారు. ఏదైనా అపశ్రుతి జరగకముందే విద్యుత్ శాఖ అధికారులు స్పందించి, వేలాడుతున్న తీగలను సరిచేయాలని డిమాండ్ చేశారు.