బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న యువకుడు

గుంటూరు: నూజెండ్ల గ్రామంలో పదవ తరగతి బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న యువకుడిని గ్రామస్తులు పోలీసులకు అప్పగించారు. పదవ తరగతి పరీక్షా కేంద్రం వద్ద యువకుడు ద్విచక్ర వాహనంపై వచ్చి బాలికలను వెంబడిస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అక్కడే ఉన్న గ్రామస్తులు ద్విచక్ర వాహనాన్ని ఆపి ఆ యువకుడుని పట్టుకుని పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు.