'ఘనంగా ఈద్ మిలద్ ఉన్ నబీ వేడుకలు'

VSP: జీవీఎంసీ 53వ వార్డు పరిధి జాకీర్ హుస్సేన్ నగర్ మస్జీద్ - ఈ - అల్ ఖదీర్ ఆధ్వర్యంలో ఈద్ మిలద్ ఉన్ నబీ(ప్రవక్త మహమ్మద్ జన్మదినం) వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు వేకువ జమున ఫజర్ నమాజ్‌ను ఆచరించిన ముస్లిం సోదరులు ఖురాన్ పాఠించారు. చిన్నారులు నాతే కలంలు ఆలపిస్తూ నగరంలో పలు మసీదుల నుండి ముస్లింలు నిర్వహించిన శాంతి ర్యాలీలో పాల్గొన్నారు.