సహకార సంఘాల ద్వారా ఎరువుల పంపిణీ
SRPT: చిలుకూరు మండలం నారాయణపురం సహకార సంఘం ద్వారా రైతులకు సకాలంలో ఎరువులు అందిస్తున్నట్లు సొసైటీ పర్సన్ ఇంచార్జ్ చంద్రకళ తెలిపారు. సోమవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రైతులు తీసుకున్న స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలను సకాలంలో చెల్లించి సంఘం అభివృద్ధికి సహకరించాలని కోరారు. అనంతరం సీఈఓ పూర్ణయ్య వార్షిక నివేదికను చదివి వినిపించారు.