కాశిబుగ్గ టౌన్ సీఐగా విధుల్లోకి చేరిన రామకృష్ణ
SKLM: కాశీబుగ్గ టౌన్ సీఐగా వై. రామకృష్ణ ఆదివారం విధుల్లో చేరారు. కాగా ఈయన ఇదే పోలీస్ స్టేషన్‌లో 2013 నుంచి 2016 వరకు సీఐగా విధులు నిర్వహించిన విషయం తెలిసిందే. విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్న పోలీస్ ట్రైనింగ్ కళాశాల నుంచి కాశీబుగ్గ స్టేషన్‌లో సీఐగా విధుల్లో చేరారు. ఇదే స్టేషన్లో సీఐగా విధులు నిర్వహిస్తున్న సూర్యనారాయణ వీఆర్‌కు తరలించారు.