ప్రత్యేక అలంకరణలో శ్రీ అంకమ్మ తల్లి గుడి
NLR: అల్లూరు పట్టణంలోని శ్రీ అంకమ్మ తల్లి వార్షిక జాతరను నిర్వాహకులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. విశేష పుష్ప అలంకరణలో అమ్మవారి గుడిని అందంగా అలంకరించారు. ప్రత్యేక అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో అమ్మవారి గ్రామోత్సవాలు ఉంటాయి.. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకోవాలని నిర్వహకులు పేర్కొన్నారు.