13 మంది 16 సెట్ల నామినేషన్లు

నల్గొండ: వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లలో భాగంగా శుక్రవారం 13 మంది అభ్యర్థులు 16 సెట్ల నామినేషన్లను దాఖలు చేసినట్లు నల్గొండ జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో అభ్యర్థులు తమ నామినేషన్లు సమర్పించినట్లు పేర్కొన్నారు.