ఏర్పేడులో టీచర్ సస్పెండ్
TPT: ఏర్పేడు మండలంలోని ఆముదూరు పాఠశాల ఉపాధ్యాయుడు మద్యం సేవించి పాఠశాలకు హాజరై, పాఠశాల ప్రాంగణంలో పడిపోవడం, తరువాత తరగతి గదిలో విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేయడం వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో గ్రామస్థులు ఎంఈఓకి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి, సంబంధిత ఉపాధ్యాయుడిని వెంటనే విధుల నుంచి ఎంఈఓ సస్పెండ్ చేశారు.