రౌడీషీటర్ సుజన్ నేత్రాలు దానం

NLR: వేదాయపాలెంలో శుక్రవారం రాత్రి రౌడీ షీటర్ సుజన్ కృష్ణ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతడి కుటుంబ సభ్యులు సుజన్ కృష్ణ కళ్లను దానం చేశారు. ఈ మేరకు ఆయన కళ్లను ఎల్వీప్రసాద్ కంటి ఆస్పత్రి సిబ్బంది సేకరించారు. మరోవైపు ఈ కేసులో విచారణ వేగంగా జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు.