రక్త వీర అవార్డు అందుకోనున్న వెంకటరమణ

రక్తదాతల సమూహాన్ని ఏర్పాటు చేసి సేవ చేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు పరుష వెంకటరమణకు జాతీయ రక్తవీర అవార్డు వరించింది. ఈ సందర్భంగా ఆయన మంగళవారం న్యూఢిల్లీలోని అశోక హోటల్లో అవార్డు అందుకోకున్నారు. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెంకటరమణ మాట్లాడుతూ.. 2023లో తలసేమియాతో బాధపడుతున్న చిన్నారుల కోసం 4 యూనిట్ల రక్తాన్ని సేకరించానని అన్నారు.