విజయ్‌కు టీవీకే నాయకురాలి ప్రశ్న
తన భార్య విడాకులు కోరిన వ్యవహారంపై టీవీకే అధ్యక్షుడు విజయ్ మాట్లాడిన తీరుపై ఆ పార్టీ నాయకురాలు రంజనా నాచ్చియారు స్పందించారు. విడాకుల సమస్య గురించి విజయ్ మాట్లాడుతూ.. 'అది వర్త్ కాదు' అన్నారని.. అసలు వర్త్ కానిది మీ భార్యనా, లేక వైవాహిక జీవితమా అని ఆమె ప్రశ్నించారు. మహిళల గౌరవాన్ని కాపాడే భాష మీ పదాల్లో కనిపించకపోతే ఇక రాజకీయం ఎందుకని, మీ నిజ స్వరూపం ఏమిటని నిలదీశారు.