సమస్యలపై వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే
AKP: సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అన్నారు. ఆదివారం సమస్యలపై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వాటిని పరిశీలించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నియోజకవర్గం సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.