రేపు వరంగల్‌లో పవర్ కట్

రేపు వరంగల్‌లో పవర్ కట్

WGL: వరంగల్లోని పలు ప్రాంతాల్లో ఈ నెల 2న విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగనుందని వరంగల్ టౌన్ డీఈ ఎస్.మల్లికార్జున్ తెలిపారు. వరంగల్లోని గణేష్ నగర్, జూనియర్ కాలేజ్, వసంతపూర్ రోడ్, మామూనూర్, కుమార్పల్లి, డెయిరీఫామ్ ప్రాంతాల్లో ఉదయం 9 నుంచి 12 గంటల వరకు విద్యుత్ సరఫరా చేయనున్నట్లు వివరించారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.