రాజమండ్రిలో ప్రారంభమైన టీడీపీ మహానాడు
రాజమండ్రిలో నేడు, రేపు టీడీపీ మహానాడు నిర్వహిస్తోంది. మహానాడుకు టీడీపీ అధినేత చంద్రబాబు, సీనియర్ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.
రాజమండ్రిలో టీడీపీ మహానాడు కార్యక్రమం ప్రారంభమైంది. నేడు, రేపు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఇప్పటికే అధినేత చంద్రబాబు, పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలు రాజమండ్రికి చేరుకున్నారు. సుమారు 50 వేల మంది ఈ కార్యక్రమానికి హజరుకానున్నట్టు సమాచారం.