బ్రహ్మోత్సవాలకు మంత్రులకు ఆహ్వానం

బ్రహ్మోత్సవాలకు మంత్రులకు ఆహ్వానం

SRD: పటాన్‌చెరు మండలం రుద్రారం సిద్ధి వినాయక ఆలయం బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర మంత్రులకు ఆలయ కమిటీ నిర్వాహకులు ఆహ్వానం పలికారు. శనివారం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రి వివేక్‌లకు ఆలయ EO లావణ్య ఆధ్వర్యంలో అర్చక బృందం బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 6 వరకు జరిగే కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.