CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
GNTR: పెదకాకాని మండలంలో ఆదివారం అనారోగ్యంతో బాధపడుతున్న లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ. 4,40,497 విలువైన ఐదు చెక్కులను ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పంపిణీ చేశారు. ప్రభుత్వం కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందిస్తుందని ఆయన తెలిపారు. చికిత్సకు అయిన ఖర్చు రసీదుల ఆధారంగా సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నామని పేర్కొన్నారు.