రెండో రోజు కొనసాగుతున్న సిట్ విచారణ
TPT: తిరుమల కల్తీ నెయ్యి కేసులో మాజీ ఈవో ధర్మారెడ్డిని రెండో రోజు సిట్ విచారిస్తోంది. ఉదయం 8.30 గంటలకు అలిపిరి సమీపంలోని సిట్ కార్యాలయానికి ఆయన చేరుకున్నారు. మంగళవారం జరిగిన విచారణలో అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోవడంతో తిరిగి వాటిని అడిగే అవకాశం ఉంది.