'విధి నిర్వహణలో హోంగార్డ్స్ అప్రమత్తంగా ఉండాలి'
AKP: నర్సీపట్నం పోలీస్ స్టేషన్ ఆవరణలో హోంగార్డులకు శుక్రవారం ఉదయం రోల్ కాల్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హోంగార్డ్స్ ఇంఛార్జ్ ఎస్పై నర్సింగ్ రావు మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు హోంగార్డ్స్ బందోబస్తు డ్యూటీకి వెళ్ళిన సమయంలో ప్రతి ఒక్కరూ నిబంధనలను పాటించాలన్నారు. హోంగార్డ్స్ సంక్షేమం కొరకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.