సాగర్ ప్రాజెక్టు ఉద్యోగులకు తప్పని 'వేతన' కష్టాలు
NLG: నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఫిబ్రవరి నెల వేతనాలు నేటికీ అందని వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సాగర్ ఎస్ఈ కార్యాలయంలోని ఈఈ స్థాయి నుంచి స్వీపర్ వరకు మొత్తం 61 మంది ఉద్యోగులకు జీతాలు ఆగిపోయాయని తెలిపారు. సాధారణంగా ప్రతి నెల 5వ తేదీలోపు పడే జీతాలు, 15వ తేదీ వస్తున్నా జమకాకపోవడంతో ఈఎంఐలు కట్టలేక, కుటుంబ పోషణ భారమైందని ఉద్యోగులు వాపోతున్నారు.