యువకునిపై పోక్సో కేసు నమోదు

యువకునిపై  పోక్సో కేసు నమోదు

SRCL: ఎల్లారెడ్డిపేట మండలంలోని ఓ యువకుడిని పోక్సో కేసులో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని ఎస్సై రాహుల్ రెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలానికి చెందిన పుట్టకొక్కుల రంజిత్, రాచర్ల గొల్లపల్లిలోని ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పని చేస్తున్నాడు. మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి శారీరకంగా వాడుకున్నాడని ఆమె ఫిర్యాదు చేయడంతో, అతనిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.