చేతి పంపు బోరు మరమ్మతులు చేపట్టాలి

చేతి పంపు బోరు మరమ్మతులు చేపట్టాలి

ASR: డుంబ్రిగూడ గ్రామంలోని పైవీధిలో ఉన్న చేతి పంపు బోరు మరమ్మతులకు గురై నిరూపంగా మారిందని స్థానిక గిరిజనులు తెలిపారు. దీంతో తాగునీరు కోసం చాలా ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు అధికారులకు తెలిపినా పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టి తాగునీరు సమస్య పరిష్కరించాలంటున్నారు.