కడెం ప్రాజెక్టులోకి భారీగా పెరుగుతున్న నీటిమట్టం

కడెం ప్రాజెక్టులోకి భారీగా పెరుగుతున్న నీటిమట్టం

NRML: కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టులో నీటిమట్టం 697.950 అడుగులకు చేరుకున్నట్లు ప్రాజెక్టు అధికారులు సోమవారం ప్రకటనలో తెలిపారు. ప్రస్తుత సామర్థ్యం 4.191 టీఎంసీలు కాగా, ఎగువ ప్రాంతాల నుంచి 6304 క్యూసెక్కులు నీరు వచ్చి చేరుతుందని, ఒక గేట్ ఎత్తి 4665 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామన్నారు. ప్రాజెక్టు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.