VIDEO: గొడ్డలితో అగంతకుడి హంగామా
WGL: నెక్కొండ మండల కేంద్రంలో ఓ అగంతకుడు గొడ్డలితో బుధవారం ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్న ఘటన కలకలం రేపింది. యాచకుడిలా కనిపిస్తున్న వ్యక్తి రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు, దుకాణాలకు వచ్చే ప్రజలను గొడ్డలితో బెదిరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు వెంటనే స్పందించి అగంతకుడిని అదుపులోకి తీసుకొవాలని స్థానికులు కోరుతున్నారు.