ఆక్రమణదారులపై సీఐ ఉక్కుపాదం

ఆక్రమణదారులపై సీఐ ఉక్కుపాదం

VZM: మహా శివరాత్రి సందర్భంగా పుణ్యగిరి యాత్రికులకు ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా ఎస్.కోట పట్టణంలో పలుచోట్ల ఉన్న ఆక్రమణలను ఎస్.కోట పట్టణ సీఐ నారాయణమూర్తి దగ్గర ఉండి శుక్రవారం తొలగించారు. ఉత్తర కాశీగా పేరు పొందిన పుణ్యగిరి యాత్రకు అధిక సంఖ్యలో భక్తులు రానుండడంతో ఆక్రమణలకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రోడ్లపై ఎటువంటి తోపుడు బండ్లు పెట్టకూడదని హెచ్చరించారు.