VIDEO: చూస్తుండగానే బూడిదయ్యారు!
TG: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మేదిరిపేట వద్ద ఘోర ప్రమాదం జరిగింది. స్థానిక పెట్రోల్ బంక్ నుంచి భారీ ఇనుప స్టాండును తరలిస్తుండగా, అది ప్రమాదవశాత్తు 11 కేవీ విద్యుత్ లైన్‌కు తగిలింది. ఈ ఘటనలో డ్రైవర్ నాగరాజు, కూలీ నారాయణ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయ విదారక దృశ్యాలు సీసీ టీవీలో రికార్డయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.