పోలీస్ అవుట్ పోస్ట్ భవనం ప్రారంభం

VZM: గంట్యాడ మండలంలోని తాటిపూడిలో నూతనంగా నిర్మించిన పోలీస్ అవుట్ పోస్ట్ భవనాన్ని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మంగళవారం ప్రారంభించారు. నూతన భవనంలోని అన్ని గదులను ఎస్పీ పరిశీలించారు. అనంతరం అయన మాట్లాడుతూ.. ఈ అవుట్ పోస్ట్ ప్రజలకు ఎంతో ఉపయోగకరమన్నారు. ఏఎస్‌పీ స్వామిలత, డీఎస్పీ శ్రీనివాసరావు రూరల్ సీఐ లక్ష్మణరావు, ఎస్సై సాయి కృష్ణ పాల్గొన్నారు.