ప్రేమ విఫలం.. యువకుడు ఆత్మహత్య
అనంతపురం జిల్లాలోని ఓ యువకుడు ప్రేమ విఫలమైందని ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం జరిగింది. అయితే శివకుమార్ రెడ్డి అనే యువకుడు కొంతకాలంగా ప్రేమించిన యువతి తన ప్రేమను అంగీకరించపోవడంతో మనస్థాపానికి గురై, కోమలి సమీపంలో రైలు కింద పడి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.