ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జేసీ
ELR: గణపవరం మండలం మొయ్యేరులోని రైతు సేవ కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతు సేవా కేంద్రంలో ధాన్యం కొనుగోలుకు ఉపయోగించే యంత్ర పరికరాలను ఆయన పరిశీలించారు. ధాన్యం కొనుగోలు సంబంధించి రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా బాధ్యతగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు.