బీఆర్ఎస్ నాయకులు గ్రామాల్లో పర్యటించాలి: ఎమ్మెల్యే

JN: భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు ప్రతి గ్రామంలో పర్యటించి ప్రజలకు అండగా ఉండాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సూచించారు. ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. వర్షాల వల్ల తలెత్తే సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉంటూ సమన్వయంతో పని చేయాలని కోరారు.