సచివాలయంలో MLA ఆకస్మిక తనిఖీలు

సచివాలయంలో MLA ఆకస్మిక తనిఖీలు

NDL: డోన్ మండల పరిధిలోని కొట్రాయి సచివాలయాన్ని మంగళవారం ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రజలకు అందుతున్న ప్రభుత్వ పథకాలు, సేవలను అడిగి తెలుసుకున్నారు. విధి నిర్వహణలో అలసత్వం వహించిన పలువురు సచివాలయ ఉద్యోగులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. తీరు మారకపోతే చర్యలు తప్పవని ఉద్యోగులను ఆయన హెచ్చరించారు.