BJP నేతలపై మంత్రి పొన్నం ఆగ్రహం

TG: బీజేపీ నేతలు మతిభ్రమించి మాట్లాడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. 'మా ప్రభుత్వం ఐదేళ్ల పాటు ఉంటుంది. BJP నేతలు జ్యోతిష్యులుగా మారిపోయారు. అసత్యాలు మాట్లాడటం మానుకోవాలి. పార్టీలో పట్టుకోసం ఈటల ప్రయత్నిస్తున్నారు. అందుకే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. కేంద్ర ప్రాజెక్టులకు రాష్ట్రం సహకరిస్తోంది. కరీంనగర్‌లో సైనిక్ స్కూల్ పెడితే స్వాగతిస్తా' అన్నారు.