ఎల్ఎండి గేట్లు ఎత్తనున్న అధికారులు
KNR: లోయరు మానేరు జలాశయం ఎల్ఎండీ గేట్లను ఎత్తనున్నట్లు అధికారులు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు రెండు గేట్లను ఎత్తి 4000 క్యూసెక్కుల నీటిని మానేరు వాగులోకి వదలనున్నట్లు చెప్పారు. మానేరు వాగు పరిసర ప్రాంతాల రైతులు, మత్స్యకారులు, పశువుల కాపరులు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.