రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు బోయినపల్లి యువకుడు
SRCL: బోయిన్‌పల్లి మండల కేంద్రానికి చెందిన గుంటి శ్రీకాంత్ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక అయినట్టు జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ ముస్కు మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి సింగారపు తిరుపతి ఒక ప్రకటనలో తెలిపారు. 51వ రాష్ట్ర స్థాయి జూనియర్ కబడ్డీ పోటీలు ఈ నెల 5 నుంచి 7 వరకు మహుబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జరిగే పోటీలలో జిల్లా తరుపున పాల్గొంటాడు.