'నగదు సీజ్ చేస్తే తప్పనిసరిగా రసీదు ఇవ్వాలి'

'నగదు సీజ్ చేస్తే తప్పనిసరిగా రసీదు ఇవ్వాలి'

KNR: పంచాయతీ ఎన్నికల సందర్భంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లో భాగంగా తనిఖీలు చేపట్టే సమయంలో సీజ్ చేసే నగదు, బంగారం, ఇతర వస్తువులకు సంబంధించి తప్పనిసరిగా రసీదు ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ. రాణి కుముదిని ఆదేశించారు. జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడుతూ.. తనిఖీల సమయంలో రూ. 50వేల కంటే ఎక్కువ నగదు ఉంటే సీజ్ చేయాలన్నారు.