VIDEO: హోలీ సంబరాల్లో డాన్స్‌తో అదరగొట్టిని ఎస్సీ
KMR: జిల్లా పోలీస్ కార్యాలయంలో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర స్వయంగా పాల్గొని సిబ్బందితో కలిసి రంగులు పూసుకుని శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన డీజే వేడుకల్లో ఉత్సాహంగా డాన్స్ వేశారు. ఆయన మాట్లాడుతూ.. నిరంతరం విధుల్లో నిమగ్నమయ్యే పోలీసులకు ఇలాంటి వేడుకలు మానసిక ఉల్లాసాన్ని, సిబ్బంది మధ్య ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.