కబడ్డీ పోటీల్లో సత్తా చాటిన సోనూ

కబడ్డీ పోటీల్లో సత్తా చాటిన సోనూ

KMR: లింగంపేట మండలంలోని ముంబాజిపేట తండాకు చెందిన జరుప్ల సోనూ హైదరాబాద్‌లో జేఎన్‌టీయూ నిర్వహించిన చీఫ్ మినిస్టర్స్ కప్ కబడ్డీ టోర్నమెంట్‌లో ప్రతిభ కనబర్చి అందరి ప్రశంసలు పొందింది. ఈ సందర్భంగా శుక్రవారం రాష్ట్ర సలహాదారు కే. కేశవ్ రావు ఆమెను అభినందించారు. గ్రామానికి చెందిన క్రీడాకారిణి రాష్ట్రస్థాయిలో సత్తా చాటడం గర్వకారణమని పేర్కొన్నారు.