VIDEO: హెల్మెట్‌పై విద్యార్థుల చైతన్య ప్రదర్శన
MHBD: కొత్తగూడ మండలం కార్లయి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు హెల్మెట్ వినియోగంపై ప్రజలను చైతన్య పర్చేందుకు బుధవారం నిర్వహించిన ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది. విద్యార్థుల హావభావాలతో మొబైల్ ఫోన్ వినియోగిస్తూ ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తే కలిగే అనర్థాలను కళ్లకు కట్టినట్టు చూపించారు.హెల్మెట్ ధారణతో సురక్షితంగా తమ గమ్యం చేరుకోవచ్చని అద్భుతంగా ప్రదర్శించారు.