కళ్యాణదుర్గంలో రూ.3 కోట్ల హైటెక్ మోసం

కళ్యాణదుర్గంలో రూ.3 కోట్ల హైటెక్ మోసం

ATP: కళ్యాణదుర్గంలో వైసీపీ నేత ఎర్రిస్వామి భారీ మోసానికి పాల్పడ్డారు. తన బ్యాంకు ఖాతాలో రూ.7లక్షల కోట్లు ఉన్నాయని, వాటిని డ్రా చేసేందుకు సాయం చేస్తే వాటా ఇస్తానని నమ్మించి సుమారు 70మంది నుంచి రూ.3 కోట్లు వసూలు చేశారు. నకిలీ బ్యాంక్ స్టేట్‌మెంట్లతో అమాయకులను బురిడీ కొట్టించారు. యూనియన్ బ్యాంక్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.