ఓపెన్ స్కూల్ ఫలితాలు విడుదల
SRD: ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ ఫలితాలు విడుదల చేసినట్లు వెంకటస్వామి గురువారం తెలిపారు. పదవ తరగతిలో 258కి 155 మంది ఉత్తీర్ణులై 60.08 శాతం సాధించినట్లు చెప్పారు. ఇంటర్మీడియట్‌లో 603కి 271 మంది ఉత్తీర్ణులై 44.94 సాధించినట్లు పేర్కొన్నారు. ఫలితాలను www.telanganaopenschool.rog వెబ్ సైట్ లో చూడవచ్చని చెప్పారు.