వేలంగిలో ఆకట్టుకున్న నృత్య పోటీలు
KKD: వేలంగిలోని పట్టబద్రుల యూత్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన సోలో, గ్రూప్ డాన్స్ పోటీలు అందర్నీ విశేషంగా ఆకట్టుకున్నాయి. కూచిపూడి, భరతనాట్యంతో పాటు ఇతర సాంప్రదాయ కళలను చిన్నారులు అద్భుతంగా ప్రదర్శించి తమ ప్రతిభచాటుకున్నారు. గ్రామీణ ప్రాంత కళాకారులను పరిచయం చేసేందుకు ఈ పోటీలు నిర్వహించినట్లు యూత్ ప్రతినిదులు తెలిపారు.