పెళ్లి ఇంట్లో తీవ్ర విషాదం
VKB: పెళ్లి ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. యాలాల్ మండలం సగెంకుర్దుకు చెందిన అనంతప్ప అనే వ్యక్తి కూతురు పెళ్లి పనుల నిమిత్తం మార్కెట్ కు వెళ్లి వస్తుండగా లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబసభ్యులు అసుపత్రికి తరలించగా చికిత్స పోందుతూ మృతి చెందాడు. అయితే కూతురి కోసం ఏర్పాటు చేసిన పందిరి కిందనే తండ్రి మృతదేహం ఉండటం అక్కడి వారిని తీవ్రంగా కలిచివేసింది.