స్వామి వారికి ముత్యాల అంగీ సమర్పించిన భక్తులు
కృష్ణా: గుడివాడ పట్టణం జగన్నాధపురంలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి డాక్టర్ చాగంటిపాటి రాజ్ కుమార్, డాక్టర్ సౌజన్య దంపతులు శుక్రవారం ముత్యాల అంగీ (కటివాలయం)ను సమర్పించారు. జగన్నాధపురం వీధుల్లో మేళా తాళాలు, కోలాట నృత్యాల మధ్య ఈ అంగీని ఊరేగించి, స్వామివారికి పూజా కార్యక్రమాల అనంతరం అందజేశారు. అనంతరం అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.